Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 13న తలపెట్టిన చలో ఢిల్లీ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కోడిపాక సంజీవ్, రాష్ట్ర కార్య దర్శి తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ అధ్యక్షుడు పుల్ల సతీష్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్రాలను రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి, రాష్ట్ర నాయ కుడు కొడెపాక సంజీవ్ బుధవారం ముఖ్య అతిథులుగా హాజరై విడుదల చేసి మాట్లా డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ఎలుకటి రాజయ్య, జిల్లా అధ్య క్షుడు రేనుకుంట్ల మహేష్, జిల్లా నాయకుడు బచ్చల చిరంజీవి, టేకుమట్ల మండల అధ్య క్షుడు రేనుకుంట్ల రాము, నాయకులు నెరుపటి రమేష్, శీలపాక నరేష్, సంతోష్, రాజేందర్, బొట్ల మొగిలి, తదితరులు పాల్గొన్నారు.