Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్లో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి అవగాహనా సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లక్ష్మీ రవి హాజరై మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసుకుని తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వరి ధాన్యాన్ని గ్రామాల్లో మధ్య ధరలకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. అనంతరం ఏఓ ఏఓ వాసుదేవరెడ్డి మాట్లాడారు. రైతులు ఆధార్ నెంబర్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. రైతులు సమీపంలోని పోస్టాఫీస్‌లో, ఆధార్ నమోదు కేంద్రం, మీ సేవా కేంద్రాల్లో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రేగొండ, మడతపల్లి, రేపాక, సుల్తాన్పూర్, చిన్నకోడెపాక, దమ్మన్నపేటల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మటిక సంతోష్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్‌గా పాపిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, పీఏసీఎస్ సీఈఓ జగన్, ఏఈఓలు వైజయంతి, ప్రశాంత్, సునీల్, స్రవంతి, కల్యాణ్, గోవర్ధన్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.