Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తహసీల్దార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన స్మశానవాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేసుకున్నారని గ్రామానికి చెందిన అమిలి చంద్రం, చిన్నపల్లి రాంబాబు, దంతనపల్లి నరేందర్, గుండు నర్సయ్య, బసారికారి హరికష్ణ, బోడ బోరయ్య, చిన్నపల్లి స్వామి, రతన్‌సింగ్, కెక్కం జగదీష్, ధీకొండ కాంతారావు బుధవారం తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్, ఎంపీఓ శ్రీకాంత్ బెహరాలకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల అధికారులు ఎంపీఓ శ్రీకాంత్ బెహరా, వీఆర్ఓ సూరయ్య, పంచాయతీకార్యదర్శి ఇందారపు సునీతలను మోకాపైకి పంపించి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తిమ్మంపేట గ్రామ పెద్దలను పిలిపించి స్మశానవాటిక భూమి హద్దులను గుర్తించి సుమారు 30 గుంటల వరకు కబ్జాకు యత్నించినట్లు అధికారులకు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా గ్రామాల్లో వైకుంఠథామాలు నిర్మించగా అట్టి పనులను కాంట్రాక్టు పొందిన ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడే స్మశానవాటిక స్థలాన్ని కాజేసేందుకు ఉద్దేశ్యపూరితంగా హద్దులు జరిపి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామపెద్దలు అధికారులకు వివరించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించి కబ్జా స్థలాన్ని స్మశానవాటికలో కలిపేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.