Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
కాశిబుగ్గలోని వివేకానంద జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు వివేకానంద కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు భరత్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల విద్యాభివద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే పెట్రోల్ బంక్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేనియెడల ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అరగంటసేపు జరిగిన ధర్నాతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ నరేష్, ఇంతేజార్ గంజ్ ఎస్ ఐ స్వామిలు ఆందోళనకారులతో మాట్లాడిన ధర్నా విరమింప చేశారు.
కాలేజీ స్థలంలో పెట్రోల్ పంప్ చట్ట విరుద్ధం..
వివేకానంద జూనియర్ కళాశాల స్థలంలో పెట్రోల్ పంపు నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమని ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు హకీమ్ నవీన్ అన్నారు. వరంగల్ తూర్పులో బుధవారం గ్రేటర్ వరంగల్ కో-కన్వీనర్ అభిషేక్ అధ్యక్షతన జరిగిన ఏబీఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్య అవసరాల నిమిత్తం కార్పొరేషన్ ఇచ్చిన భూమిని ఇతరులకు కేటాయించే హక్కు సొసైటీకి లేదన్నారుసమావేశంలో నాయకులు సతీష్, వినరు, రోహిత్, సభజ్ పాల్గొన్నారు.
లీజ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నవతెలంగాణ-మట్టెవాడ
విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాలయాల కోసం కేటాయించిన స్థలంలో పెట్రోల్ బంకులు నిర్మించడం అన్యాయమని, దీనిని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం కళాశాల మైదానంలో లీజుకు ఇవ్వడానికి నిరసిస్తూ ధర్నా చేశారు. అనంతరం స్థానిక ఓంకార్ భవన్లో జిల్లా అధ్యక్షుడు బండారి చిరంజీవి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల పురోగతి కోసం నామమాత్రపు ఫీజు తో ప్రభుత్వం కేటాయించిన వివేకానంద కళాశాల స్థలం ఆవరణలో పెట్రోల్ బంక్ కోసం కళాశాల స్థలం నుండి భూమిని కేటాయించడం సిగ్గుచేటని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు లక్క సునీత, కుమార్, ప్రేమ్ సాయి, ప్రణరు కుమార్ రపాల్గొన్నారు.