Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎయిడ్స్ నియంత్రణకు సమాజంలో అవగాహన పెంపొందించాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ రమేశ్ అన్నారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహించిన ర్యాలీని ఉపకులపతి రమేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌ను నివారించడానికి ప్రపంచదేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయన్నారు. మన దేశంలో ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వపరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఈ కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ హనుమంతు, కళాశాల సహాయక రిజిష్ట్రార్ కిష్టయ్య, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు డాక్టర్ నాగయ్య, డాక్టర్ శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష సరికాదు
నవతెలంగాణ-మట్టెవాడ
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష సరికాదని, వారికి అన్ని విధాలా సహకారం అందించాలని వరంగల్ కలెక్టర్ బీ గోపీ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా బుధవారం వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కే వెంకటరమణ అధ్యక్షతన కాకతీయ వైద్య కళాశాల నుంచి వరంగల్ ఐఎంఏ భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కషి చేస్తూ ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంఘాలకు గౌరవ పురస్కారాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా సమాజంలో చూడకూడదని, వారు స్వేచ్ఛగా జీవించడానికి కావలసిన అవకాశాలు కల్పించాలని కోరారు. తన వంతు బాధ్యతగా వారికీ రుణాలను, పెన్షన్‌ను అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కే వెంకటరమణ మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య, వారికి కల్పిస్తున్న చికిత్స సదుపాయాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఐ ఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, కార్యదర్శి డాక్టర్ నారాయణ రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు డాక్టర్ పెసరు విజరు చందర్ రెడ్డి, డాక్టర్ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
నవతెలంగాణ-సుబేదారి
అపోహలను తొలగించి ప్రజలకు ఎయిడ్ప్పై అవగాహన పెంచాలని జిల్లా జడ్డి ఎన్ నర్సింహారావు తెలిపారు. బుధవారం ప్రపంచ ఎయిడ్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి, జిల్లా వైద్యారోగ్య శాఖ, హనుమకొండల అధ్వర్యంలో ఎన్ఐటీ నుంచి ఏర్పాటు చేసిన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ లలితాదేవి, లీగల్ సర్వీసెస్ సెక్రటరీ మహేశ్ నాథ్‌లతో కలసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తదనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, వైస్ చాన్స్‌లర్ ఆచార్య రమేశ్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.