Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
రైతులు ప్రత్యామ్నయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఏఓ అనురాధ అన్నారు. మడిపల్లి గ్రామం జయగిరి క్లస్టర్ రైతు వేదికలో గ్రామ సర్పంచ్ చిర్ర సుమలతవిజరుకుమార్ అధ్యక్షతన రైతులకు యాసంగి-2021 పంట కాలానికి గానూ వరికి ప్రత్యామ్నాయ పంటల గురించి బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరికి బదులుగా పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, పెసర, మినుము, పప్పు దినుసులు పంటలు వేసుకోవాలని సూచించారు. యాసంగి పంటలకు సంబంధించి సాగు వివరాలు తెలిపే పుస్తకాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ క్రాంతికుమార్, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు రవీందర్, రాజ్ కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.