Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శ్యాంకుమార్‌కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు చమరగితం పాడే టైమ్ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ.10లు తగ్గించిందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రూ.7లు తగ్గినట్టు తెలిపారు. అయినా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, కిసానమోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీరా కిశోర్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సానికొమ్ము హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.