Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ వర్కర్ రేగ పాపయ్య
నవతెలంగాణ-మంగపేట
ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరు కషి చేయాలని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు, సోషల్ వర్కర్ రేగ పాపయ్య అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవాన్ని పుర్కరించుకోని పాఠశాల విద్యార్థులతో కలిసి బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధికి మందులున్నా నివారణ ఒక్కటే మార్గమన్నారు. ఎయిడ్స్ సోకిన వ్యక్తులు పౌష్టికాహారంతో చాలా కాలం జీవించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి ఆస్పత్రి వైద్యురాలు మంకిడి ట్వింకిల్ నిఖిత, ఇన్ఛార్జి హెచ్ఎం జవహర్లాల్, ఉపాధ్యాయులు రాజశేఖర్, నాగేశ్వర్రావు, సంపత్, ఏఎన్ఎం సోమలక్ష్మీ, ప్రేమ్ సాగర్, లక్ష్మీ, స్వరూప, శ్రావ్య, పార్వతి, వెంకటలక్ష్మీ, స్వప్న, జనార్ధన్ పాల్గొన్నారు.