Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపోలో డయాగస్టిక్స్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-ములుగు
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అపోలో డయాగ స్టిక్ సెంటర్ను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మారుమూల, ఏజెన్సీ ప్రజలు సైతం వైద్య పరీక్షల కోసం వచ్చే అవకాశమున్న క్రమంలో నాణ్యత పాటించాలని సూచించారు. అన్ని రకాల వైద్య పరీక్షలను అందు బాటులోకి తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, పట్టణ అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, నాయకులు మామిడిశెట్టి కోటి, చంద్ తదితరులు పాల్గొన్నారు.