Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-ఖిలా వరంగల్
దేశంలో మైనార్టీలపై జరుగుతున్న మతోన్మాద దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. బుధవారం రంగశాయిపేట ఆర్టీఏ జంక్షన్లో మతోన్మాద దాడులను ఖండిస్తూ సీపీఐ(ఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత నుంచి వైదొలగి మత భావజాలం, మతాల మధ్య చిచ్చు పెట్టే పాత్రను పెంచి పోషిస్తోందని విమర్శించారు. మనువాదానికి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్దళ్ దాడులకు వ్యతిరేకంగా లౌకిక వాదులు, మేధావులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏరియా కార్యదర్శి ఎం సాగర్ మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేఖంగా ప్రజలు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు ఎం ప్రత్యూష, ఏసుదాసు, బీ కష్ణ, ఎం జ్యోతి, నాయకులు ఎర్ర హరిబాబు, సుధాకర్, మారయ్య ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జనగామ
లౌకిక, ప్రజాస్వామ్య వాదులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీలపై మతోన్మాద దాడులను ఆపాలని బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వారి పట్ల ప్రజా వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి దేశంలో కులం, మతం పేరుతో మైనార్టీలపై, దళితులపై ఆర్ఎస్ఎస్, సంఫ్‌ు పరివార్ శక్తులతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. బలమైన ప్రజా ఉద్యమాల ద్వారానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను ఓడించగలమన్నారు. మతోన్మాద ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు జరిగే ఉద్యమాలలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, వెంకట్రాజం, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు సింగారపు రమేష్, బొట్ల శేఖర్ , ఎండీ అజారుద్దీన్, పల్లెర లలిత, దూసరి నాగరాజు, ధర్మభిక్షం పాల్గొన్నారు.