Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మందపల్లిలో దురాక్రమణకు కుట్ర
అ స్పందించని రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎస్టీలకు చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి పెత్తందారులు తీవ్రంగా యత్నించడంతో బాధిత కుటుంబాలు వరంగల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిరమందపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 70 ఏండ్లుగా గ్రామంలోని సర్వేనెంబర్-2లో కొనుగోలు చేసిన భూమి తమదంటూ రెడ్లు హద్దులు పాతుతున్నారని బాధితుడు పల్లంకొండ ఎల్లయ్య వాపోయాడు. ఈ విషయమై జులైలో దుగ్గొండి తహసీల్ధార్కు ఫిర్యాదు చేశాడు. తమ పేరిట పట్టా పాసుపుస్తకం ఉన్నా, రెడ్లు కూడా తమ భూమిపై పట్టాదారు పాసుపుస్తకం తీసుకున్నట్లు తెలిసిందని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తహసీల్ధార్, పోలిస్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్వేయర్ సుజాత సర్వే చేసి బాధిత భూమిలో హద్దులు పాతకుండానే వెళ్లారని, అనంతరం రెడ్లు హద్దులు పాతు తుండడంతో అడ్డుకున్నామని బాధితులు తెలిపారు. ఇంత జరుగుతున్నా తహసీల్ధార్ స్పందించకపోవడం గమనార్హం.
మధిరమందపల్లి గ్రామంలో 38 ఏండ్ల క్రితం ఎరుకలి సామాజిక వర్గానికి చెందిన మూడు కుటుంబాలు 1.08 ఎకరాలను కొనుగోలు చేశాయి. మొదట ఇండ్లను నిర్మించుకొని అనంతరం బుతుకుదెరువు కోసం చాపలబండకు తరలివెళ్లాయి. 2010లో మళ్లీ ఈ కుటుంబాలు మధిరమందపల్లికి చేరి ఆ భూమిని చదును చేసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాయి. ఈ క్రమంలో భూముల ధరలు