Authorization
Fri March 21, 2025 06:51:03 am
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావులు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం 11.00 గంటలకు శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ భూపతిరావు వీరందరిచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేష్ తదితరులు ఎమ్మెల్సీలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.
6న 'బండా' ప్రమాణస్వీకారం
రాజ్యసభకు రాజీనామా లేఖను సమర్పించిన డాక్టర్ బండా ప్రకాశ్ ఈనెల 6వ తేదీన ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.