Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇన్చార్జి అదనపు కమిషనర్ విజయలక్ష్మి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
బల్దియా పరిధిలో వందశాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని ఇన్చార్జి అదనపు కమీషనర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాల యంలోని కౌన్సిల్ హాల్ లో మెప్మా, రెవెన్యూ, హెల్త్ సిబ్బందికి వాక్సినేషన్ సర్వేను విజయవంతంగా నిర్వ హించాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా వందశాతం వాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రణాళికా బద్దం గా ముందుకెళ్లాలన్నారు. రిసోర్స్ పర్సన్లు క్షేత్ర స్థాయిలో కచ్చితత్వంతో కూడిన వాక్సినేషన్ సమాచారం అందజేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నమునాతో కూడిన ఫార్మేట్ అందజేస్తామని, గతం లో సర్వే నిర్వహించి సంబంధిత గహలలో వాక్సినేషన్ తీసుకున్న వారి, తీసుకోని వారి సమాచారం నమోదు చేసినట్టు పేర్కొన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వాక్సినేషన్ జరగలేదన్నారు. వాక్సినేషన్ సర్వే రిపోర్ట్ ఆధారంగా మొబైల్ వాక్సినేషన్ బందాలు వాక్సినేషన్‌ను పూర్తి చేస్తాయని, బల్దియా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిర వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాక్సినేషన్ వేసేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. నగరంలోని 2 లక్షల 50 వేల గహాల సంబంధ వాక్సినేషన్ సమాచారం సేకరించాలన్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా రాజారెడ్డి, డిప్యూటీ కమీషనర్ జోనా, పన్నుల అధికారి శాంతి కుమార్, సానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య, నరేందర్, ఆర్ఓలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.