Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
చేపల పెంపకంలో మెళకువలు నేర్చుకొని ఆచరించాలని శాస్త్రవేత్త డాక్టర్ నరసింహ అన్నారు. గురువారం కషి విజ్ఞాన కేంద్రం మామునూరు ఆధ్వర్యంలో కోట వెంకటాపూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పూజారి ఉమాదేవి గోవర్ధన్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత్స్యకారులు కేవీకే అందించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ బీ రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నీటి వనరుల్లో పెరిగే జాతులను ఎంపిక చేసుకుని పెంచాలన్నారు. మత్స్య శాస్త్రవేత్త జీ రవి మాట్లాడుతూ.. చేపల పెంపకానికి స్థల ఎంపిక, చెరువు తయారీ, కలుపు మొక్కలు ఏరివేత, పాడైపోయిన చేపలకు గల తేడాలను గుర్తించే విధంగా అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కోటవెంకటపురం మత్స్య సహకార సంఘం సభ్యులు ఎర్రోళ్ల సుదర్శన్, ఎల్లయ్య, సదానందం, సామేలు, సిబ్బంది విజరు కుమార్ పాల్గొన్నారు.