Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
సెమినార్లతో విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం, ప్రశ్నించేతత్వం అలవడుతుందని ప్రధానోపాధ్యాయులు మెండు ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ పాఠశాలలో జేవీవీ తెలంగాణ పర్యావరణ విభాగం, సైన్స్ క్లబ్ చెకుముకి రీడర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డేను సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెమినార్లు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు. సెమినార్లు ద్వార విద్యార్థులకు అనేక అంశాలపైన అవగాహన కలగడంతో పాటు కొత్త విష యాలను తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ వేత్త ధర్మప్రకాశ్ రచించిన 'ఎన్విరాన్మెంటల్ ఏకోస్' పుస్తకంలోని బోపాల్ విషవాయువు దుర్ఘటన అంశాలను విద్యార్థులతో అధ్యయనం చేయించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యా యులు ఉషారాణి, వసంతమాల సమన్వయంలో బోపాల్ దుర్ఘటన- పరిణామాలు అనే అంశంపై సైన్స్ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, సిరాజుద్దీన్, రమ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.