Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్
నవతెలంగాణ-కాశిబుగ్గ
వివేకానంద జూనియర్ కళాశాలలో నిర్మించే పెట్రోల్ పంపు నిర్మాణ పనులను వెంటనే నిలిపేసిి, ఆ స్థానంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ విశ్వ నారాయణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబియా హై స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళాశాల స్థలంలో పెట్రోల్ పంపు నిర్మించడం వల్ల కళాశాల విద్యార్థులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా అవసరాల కోసం కార్పొరేషన్ ద్వారా పొందిన సొసైటీ వారు ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బంక్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చుక్క ప్రశాంత్, చింతల శ్రావణ్, రాకేష్, వినరు, వంశీ, తదితరులు పాల్గొన్నారు
కళాశాల స్థలాన్ని కాపాడుకుంటాం..
వివేకానంద జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడుకుంటామని ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు హకీం నవీద్ అన్నారు. కళాశాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ పంప్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు చిలువేరు ప్రశాంత్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వెంటనే పెట్రోల్ బంకు లీజును రద్దు చేసి, సొసైటీ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. రోహిత్, అభిషేక్, శభాష్, నవీన్, మహేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.