Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
దోపిడీ పీడన లేని సమ సమాజ నిర్మాణమే లక్ష్యం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ అన్నారు. పట్టణంలోని మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీలో పిట్టల సతీష్, వడ్లకొండ స్వామి అధ్యక్షతన గురువారం నిర్వహించిన శాఖ మహాసభలో రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలి పోతోందని, కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతమవుతోందన్నారు. పెట్టుబడిదారి పోకడలతో ద్రవ్యోల్బణం పడిపోతూ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పేద, మధ్య తరగతి ప్రజలు జీవన ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అర్థాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదను ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు. దేశంలో చిన్న పరిశ్రమలు మూతబడి నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, సాంఘిక అసమానతలు రూపుమాపాలంటే కమ్యూనిజం ఒక్కటే మార్గమన్నారు. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్, జిల్లా నాయకులు ఇల్లందుల సాంబయ్య, గడ్డం యాకయ్య, పాల కవిత నాయకులు పాల్గొన్నారు. గడ్డం నాగరాజు శాఖ కార్యదర్శిగా మాహాసభ ఏకగ్రీవంగా ఎనుకున్నట్లు ప్రకటించారు.