Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నల్లబెల్లి
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఏసీపీ ఫణీంద్ర తెలిపారు. గురువారం నరక్కపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో సమస్యలు ఎదురైతే వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వ్యక్తులను గమనించిన ఎడల పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సరైన ధ్రుపపత్రాలు లేని 18ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్న షాపు యజమానుల వద్ద మద్యం స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. కిరణాలలో గుట్కా, తంబాకు, పాన్ పరాక్, అంబర్ లాంటివి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కరుణాసాగర్ రెడ్డి, నర్సంపేట గ్రామీణ సీఐ సతీష్, నర్సంపేట డివిజన్ సీిఐలు, ఎస్ఐలు, నల్లబెల్లి ఎస్ఐ ఆర్ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.