Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ చిట్యాల యతీంద్ర
నవతెలంగాణ-శాయంపేట
కరోనా వైరస్‌తో పాటు వివిధ రకాల వేరియంట్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని లిమ్కా బుక్ రికార్డ్ గ్రహీత డాక్టర్ చిట్యాల యతీంద్ర విద్యార్థులకు సూచించారు. మండలంలోని మైలారం, ప్రగతి సింగారం, పత్తిపాక, గంగిరేనిగూడెం గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు వివరించారు. విద్యార్థులు పాఠశాలలో, ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, మాస్కు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, స్వీయ నియంత్రణ సరైన మార్గమని అన్నారు. అనంతరం విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గౌని చంద్రశేఖర్, మండలాధ్యక్షుడు ఆవుల రవీందర్, జనరల్ సెక్రటరీ మెండు శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ సతీష్ కుమార్, రాష్ట్ర మహిళ సెక్రెటరీ సంధ్య, కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్, లింగమూర్తి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.