Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి జేఏసీకి పూర్తి మద్దతు
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ,కర్షక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి జాతీయ సంఘాల ఆధ్వ ర్యంలో ఐక్యంగా ఉధృత పోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కంపేటి రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోఈ నెల 9,10,11న జేఏసీ తలపెట్టిన సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బావులు, రైల్వే ,ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రోడ్లు, గ్యాస్ తదితర రంగాలను అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా నాలుగు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 రోజుల సమ్మె చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి రావాల్సిన సౌకర్యాలు రాకుండా చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు, పొరాటాలు చపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, మెట్టు కొండ లక్ష్మీ, బి ఝాన్సీ, బందు క్రాంతి,లక్ష్మయ్య,శోభారాణి, శైలజ పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శిగా చెన్నూరి రమేష్
జయశంకర్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శిగా చెన్నూరి రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి బి మధు తెలపారు. ఇప్పటిదాకా జిల్లా కార్య దర్శిగా పనిచేస్తున్న బొట్ల చక్రపాణి హనుమకొండ జిల్లా ఉద్యమంలో కొనసాగుతుండగా ఆ స్థానంలో లో రమేష్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.