Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, పంట కాల్వల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం అధిక వర్షాలతో దెబ్బతిన్న రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని గరిమళ్ళకుంట చెరువును, భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి దోమర్లమల్ల చెరువు కెనాల్‌ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల రైతులు అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువు, కాలువల మూలంగా సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువులు పంట కాలువల వివరా లను ఇరిగేషన్ శాఖ అధికారులతో సేకరించామన్నారు. త్వరలోనే మరమ్మతు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిం చాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.