Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి డే ఘనంగా నిర్వహిస్తాం
అ ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాస్ రావు
నవతెలంగాణ- కోల్బెల్ట్
మూడు నెలలుగా చూస్తే నవంబర్లో భూపాలపల్లి ఏరియా 54శాతం ఉత్పత్తితో ఆశాజనకంగా కనిపిస్తున్నదని, రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యం డిసెంబర్ ఉత్పత్తి లక్ష్యం 4లక్షల27వేల టన్నులుగా నిర్దేశించారన్నారు. రోజువారి ఉత్పత్తిని ఏడు వేల నుండి పదివేల టన్నులకు పెంచాలని సీఎండీ ఆదేశించారన్నారు. భూపాలపల్లి ఏరియా అక్టోబర్ లో 35 కోట్ల నష్టంతో, ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు 316 కోట్ల నష్టంలో ఉందని తెలిపారు. సింగరేణిలో కార్మికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 70 మంది గైర్హాజరు ఉద్యోగుల కౌన్సెలింగ్ నిర్వహించిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఏరియాలో ఉద్యోగులకు 99శాతం వ్యాక్సినేషన్ అయిందన్నారు. డిసెంబర్ 23 సింగరేణి డేను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. సింగరేణిలో ఏరియా హాస్పిటల్ ల అభివద్ధికి ప్రత్యేక కమిటీని నియమించినట్టు తెలిపారు. భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి శస్త్ర చికిత్స అనంతరం మహిళా, పురుషుల వార్డులు, పాత యంత్ర సామాగ్రి స్థానంలో కొత్త యంత్ర సామాగ్రి, సిటీ స్కాన్ , స్పెషలిస్టుల నియామకం తదితర చర్యలు చేపడతామన్నారు. గోదావరిఖనిలో జరిగిన జాతీయ కార్మిక సంఘాల ద్వైపాక్షిక సమావేశంలో టీబీజీకేఎస్ పాల్గొన్నదని అన్నారు. వారి సూచనలు సలహాలు యాజ మాన్యం తప్పక స్వీకరిస్తుందన్నారు. ఓసి త్రీ భూ నిర్వాసితులకు కొంతమందికి ఉపాధి కల్పన ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. ఈ ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం, ఏజిఎం ఎస్ జ్యోతి పాల్గొన్నారు.