Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులతో ఆడుకుంటు న్నాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డాడు. గురువారం నర్మెట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క మండల కేంద్రం లోనే 400కు పైగా ఇందిరమ్మ ఇండ్లునిర్మించిచ్చారని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి నేడు విస్మరించారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిందన్నారు. నిరుద్యోగ భతి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఆసరా పింఛన్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే దేశంలో 50 మిలియన్ కోట్ల టన్నులున్న దేశ ఆహార ఉత్పత్తులు 120 మిలియన్ కోట్ల టన్నులకు చేరిందన్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంపల్లి లింగజి, రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షుడు జంగిటి అంజయ్య, యూత్ కాంగ్రెస్ జనగామ నియోజకవర్గం అధ్యక్షుడు కుమార, సీనియర్ నాయకులు బుక్యా జయరాం, యాదయ్య, సారంబు మధు పాల్గొన్నారు.