Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రానా
నవతెలంగాణ-కొడకండ్ల
విద్యార్థి స్థాయినుంచే కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిం చొచ్చని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రానా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు పోకుండా సన్మార్గంలో నడవాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థుల శాతం పెంచేందుకు అన్ని హంగులతో కూడిన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. మండల ప్రజా ప్రతినిధులు హాస్టళ్లను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కొర్నేలి యాస్ తదితరులు పాల్గొన్నారు.