Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేటికే-5 గేట్ మీటింగ్ లో సింగరేణి జేఏసీ నేతలు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కేంద్ర ప్రభుత్వం ఈనెల 13న తలపెట్టిన నాలుగు సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని కేటీకే ఐదవ గనిలో శుక్రవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, బీఎంఎస్ సంఘాల నాయకు పాల్గొని మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను నిరసిస్తూ ఈనెల 9, 10, 11న జేఏసీ ఆధ్వర్యంలో తల పెట్టిన మూడు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రయి వేటీకరణను అడ్డుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా పోరాడడానికి నిర్ణయించు కున్నట్టు తెలిపారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చామన్నారు. జేఏసీ నాయకులను కేంద్రంచర్చలకు పిలిచే వరకు సమ్మె ఆగదన్నారు. గతంలో చేసిన ప్రైవేటీకరణను కూడా రద్దు చేయాలని కోరారు. ప్రయివేటు పరంతో సింగరేణి భవిష్యత్తు ఉండదని అన్నారు. భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగాలు ఉండవని, ఉద్యోగస్తులకు భద్రత ఉండబోదని, ఉద్యోగ కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. కార్మికుల భవిష్యత్తును ఉద్యోగ భద్రతను కాపాడు కోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్లే డే నామ్స్ ప్రకారం మాత్రమే డ్యూటీలు ఉంటాయని, ఎవరైనా డ్యూటీలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశం లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్, ఏఐటీయూసీ నాయకులు రాజ్ కుమార్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఫ్‌ు బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ పాల్గొన్నారు.