Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
మహిళల రక్షణ చట్టాలపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని మహిళా సంక్షేమాధికారి డి కళ్యాణి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భూపాలపల్లి శ్రీచైతన్య మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎంఎస్ మూర్తి, డైరెక్టర్ శివనారాయణ ఆధ్వర్యంలో మహిళలపై హింసకు వ్యతి రేకంగా పక్షత్సవాల్లో భాగంగా అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ మహిళలు, విద్యా ర్థునిలపై రోజురోజుకు అత్యాచారాలు, దాడులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 100, 112, 181, 1098ను వినియోగించాలన్నారు. మహిళా శక్తి కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ గిరిజా, అధ్యాపకులు రాజు, ఆమని, సారయ్య, రాజేందర్, శ్రావణి పాల్గొన్నారు.