Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
సీపీఐ(ఎం) జనగామ జిల్లా రెండవ మహాసభల్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బొట్ల స్వప్న రూ.2వేలు ప్రచార దళానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన ప్రజా ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో రైతులు, వ్యవసాయ, అసంఘటిత రంగ కార్మికులు, విద్యార్థులు, యువజనులు ఉద్యోగులు, మహిళలు ఎస్సీ ఎస్టీలు తదితరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నా మన్నారు. జనగామ పట్టణ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, డ్రైనేజ్ నిర్మాణాల కోసం అనేక పోరాటాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి శ్రీనివాస్, అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బొట్ల శేఖర్, పట్టణ నాయకులు ప్రకాష్, లింగం, శ్రావణ్, లలిత, వెంకట మల్లయ్య, శ్రీకాంత్, రజిత, వరలక్ష్మి పాల్గొన్నారు.