Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రతి నెల 7వ తేదీలోగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్లకు వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. జీఓ-60 ప్రకారం పెరిగిన జీతాలు, దుస్తులు, సబ్బులు, నూనె, చెప్పులు, సేఫ్టీ పరికరాలు అందించాలన్నారు. మాస్కు లు, గ్లౌజులు, నూనెలు, సబ్బులు, బట్టలు, చెప్పులు, శానిటైజర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంద న్నారు.11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన గీతాలను విడుదల చేసి హుజురాబాద్, జమ్మికుంట, వరంగల్ కార్పొరేషన్లో చెల్లిస్తుందన్నారు. భూపాలపల్లి కార్మికులకు అదే మాదిరిగా జీతాలు చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతభత్యాలు రాకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబు, రత్నాకర్, మంజుల, సమ్మయ్య, రాజయ్య,రమేష్ పాల్గొన్నారు.