Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సొసైటీ చైర్మన్ రెడ్డి పూర్ణచంద్రరెడ్డి
నవతెలంగాణ-గణపురం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు లాభం చేకూరుతుందని గణపురం సొసైటీ చైర్మన్ రెడ్డి పూర్ణచంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మైలారం, గాంధీనగర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేష్, సర్పంచులు ఎన్ అరుణ తిరుపతిరావు, మాదం మమతాసుధాకర్, ఎంపీటీసీ మారగాని సరస్వతీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.