Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భూ నిర్వాసితుల కమిటి
నవతెలంగాణ-మల్హర్రావు
తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్ల డేంజర్ జోన్లోని 359 ఎకరాల భూముల్లో ఉన్న ఇండ్లకు టీఎస్జీపీయూతో నెంబర్లు వేయడం పూరైందని భూ నిర్వాసితుల కమిటీ వెల్లడించింది. శుక్రవారం ఆ కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను,ఇంటి స్థలాలను సేకరించాలని పదేండ్లుగా భూ నిర్వాసితుల కమిటీ పోరాటం, ధర్నాలు,నిరసనల చేపట్టిందన్నారు. మాజీమంత్రి మంథని ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పి ఛైర్మన్ పుట్ట మధుకర్ పలుమార్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కు విన్నవించామన్నారు. ఫలితంగా టీఎస్ జెన్కో కంపెనీ సీఎండీ నుంచి ఆక్వావైజేషన్ లెటర్ వచ్చిందన్నారు. దీంతో జెన్కో, రెవెన్యూశాఖ అధికారుల్లో చలనం ప్రారంభమైందన్నారు. గత 8 నుంచి సర్వే బృందాలు సర్వేలు నిర్వహించాన్నారు. శుక్రవారం వరకు 2066ఇండ్లు, 176 బైఇండ్లు మొత్తం 2242 ఇండ్లకు నెంబర్లు వేయడం పూర్తయిందన్నారు. 746 ఇండ్లకు డిజిటల్ సర్వే పూర్తియినట్టు చెప్పారు. ఎవరైనా నూతన ఇండ్లు కడితే ఇండ్లకు నెంబర్లు వేయరని, అధికారులు నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భూ నిర్వాసితుల ప్రధాన కార్యదర్శి అక్కపాక సమ్మయ్య, ఉపసర్పంచ్ చెంద్రయ్య, నిర్వాసితులు ఆర్ని సత్యనారాయణ, రావుల అంజయ్య, రామిడి గట్టయ్య, బొబ్బిలి రమేష్, అజ్మట్ అలీ, పన్నాల ఓదేలు, కిషన్ పాల్గొన్నారు.