Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రాధాన్యత క్రమంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతున్నామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలవ్యాప్తంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాగరం వద్ద పీఎంజీఎస్‌వై నిధులు రూ.4.55 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశామన్నారు. ఏనబావి గ్రామంలో రూ.6లక్షల సీడీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించామన్నారు. జీడికల్లు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సీడీఎఫ్ నిధులు రూ.4లక్షలతో ప్రహరీ పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. వడ్డీచర్ల గ్రామంలో సీడీఎఫ్ నిధులు రూ.6లక్షలతో సీసీి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామన్నారు పటేల్ గూడెం గ్రామంలో రూ.8లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించినట్టు చెప్పారు. కుందారం గ్రామంలో రూ.50లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల పనులకు త్వరలో సీఎం కేసీఆర్ రూ.170 కోట్లు మంజూరు చేయగానే ప్రాధాన్యతా క్రమంలో పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య సమక్షంలో పటేల్ గూడెం సర్పంచ్ పెండ్లి దేవేంద్ర మోహన్‌రెడ్డి, 30మంది కార్యకర్తలతో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్, కొమురవెల్లి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ సేవెళ్లి సంపత్, నియోజకవర్గ వర్క్స్ కమిటీ చైర్మెన్ బొల్లంపల్లి నాగేందర్, జిల్లా దిశా కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆయిలేని ఆగిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రుషిగంపల ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గండి మంగమ్మ యాదగిరి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దూసరి గణపతి, వైస్ ఎంపీపీ కిరణ్, ఎంపీటీసీలు మార్పు క్రిష్ణవేణి-శ్రీనివాస్, తీగల సిద్దుగౌడ్ , సర్పంచ్‌లు బొట్ల భాస్కర్, కడరి క్రిష్ణ , శాగా సుగుణ, తదితరులు పాల్గొన్నారు.