Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
భవన నిర్మాణ రంగ కార్మికులు పోరాడిసాధించుకున్న సంక్షేమబోర్డు రక్షణకు, హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు అన్నారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక లేబర్ కమిషనర్ రమేష్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. బిల్డింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో వున్న 34 వేల క్లైమ్ల పరిష్కా రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దారి మల్లించిన 1004 కోట్లు తిరిగి బోర్డులో జమచేయాలన్నారు. ట్రాక్టర్ ఇసుక రూ .600 కే అందిం చాలన్నారు. సంక్షేమ బోర్డునుండి లేదా బ్యాంకులనుండి నిర్మాణ రంగ యంత్రాలు,సామాన్లు కొనుగోలుకు వడ్డీలేని రాయితీ లోన్లు ఇవ్వాలన్నారు. కార్పెంటర్లకు సబ్సీడిపై కలప అందించాలన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో గడువు ముగిసిన కార్డులను రెన్యువల్‌కు అనుతించాలన్నారు. సొంత ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు కేటాయించాలని కోరారు. లేబర్ కోడ్ లు రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మాణంచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కుంట ఉపేందర్, పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీశైలం, గారే కోటేశ్వరరావు, భానోత్ శంకర్, యాకయ్య, శ్రీరాములు, వెంకన్న, సర్వర్, రామచంద్ర, రాము పాల్గొన్నారు.