Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భవన నిర్మాణ రంగానికి చెందిన ముడిసరుకుల ధరలు తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చెన్నూరి రమేష్ కోరారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల చట్టం, వలస కార్మికుల చట్టాల రక్షణ, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం పలు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేసి ఆయన మాట్లాడారు. జిల్లాలో భవన ఇతర నిర్మాణ కార్మికులకు ఇప్పటివరకు లేబర్ కార్యాలయం, అడ్డ స్థలాలు లేవన్నారు. తాగునీరు, టాయిలెట్స్ తదిర కనీస సౌకర్యాలు లేవన్నారు. కేంద్ర చట్టం-1996లోని స్కీమ్లన్ని రాష్ట్రంలో అమలుకావట్లేదన్నారు. వలస కార్మికుల చట్టం-1979తోపాటు, 1998 చట్టం పటిష్టంగా అమల్జేయాలన్నారు. కార్మిక సంఘాల భాగస్వామ్యంతో సంక్షేమ బోర్డు సలహా మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, 55 ఏండ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.6వేల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్ ఇవ్వాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహజ మరణానికి రూ.5లక్షలు ఇవ్వాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మామిడి సదయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఆకుల రవి, ఎస్కే జానీ, ఎస్కె చాంద్ భాషా, మల్లయ్య, అనిల్, తదితరులు పాల్గొన్నారు.