Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ట్రిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రిప్పర్లను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని వేములపల్లి, వరికోల్ గ్రామాల వద్ద చెక్ డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా అట్టి నిర్మాణ పనులకు కంకర, సిమెంట్ వంటివి అన్ లోడ్ చేసి తిరిగి అదే ట్రిప్పర్ లలో జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా వివిధ పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రెండు ట్రిప్పర్ లలో ఇసుకను తరలిస్తుండగా మండలకేంద్రంలో కాంగ్రెస్, రైతులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు గుర్తించి అడ్డుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలిసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రిప్పర్ లను స్వాధీనం చేసుకుని పోలిస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు విశ్వ సనీయ సమాచారం. ఈ ట్రిప్పర్లు ఓ అధికారి పార్టీ ఎమ్మెల్యేకు చెందినవిగా గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం.