Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నవతెలంగాణ-నర్మెట్ట
మత్స్యకారుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం నర్మెట్ట మండలంలోని గండిరామారం గ్రామ మల్లన్న గండి రిజర్వాయర్‌లో 1.29 లక్షల రొయ్య,చేప పిల్లలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. గోదావరి జలాలతో తెలంగాణ రిజర్వాయర్లు నిండుకుండలా దర్శనమిస్తు న్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. రైతుబీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జెడ్పీటీసీ శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, ఉమ్మడి మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సతీష్ శర్మ, ముదిరాజుల సంఘం నాయకులు మల్లేశం, రాజు,యాదగిరి, పాల్గొన్నారు.