Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించిన భూమి అన్యా క్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలదేనని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు భూసేకరణపై సమీ క్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి కోసం గతంలో సేక రించిన భూములను స్వాధీనం చేసుకోకపోవడంతో అన్యాక్రాంతంమై ఇబ్బంది కలుగుతుందన్నారు. సంబంధిత భూమిని అధికారులు స్వాధీనం చేసుకో వాలన్నారు. భీమ్గంపూర్ పంపుహౌస్‌కు పెండింగ్ భూమి తక్కువ ఉన్నదని, వారం రోజుల్లో భూసేకరణ చేయాలని తాసిల్ధార్ను ఆదేశించారు. కాళేేశ్వరం చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి భూ వివాదాల అర్జీలను పరిష్కరించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. అనంతరం జెన్కో భూసేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. తాడిచర్ల ఏఎంఆర్ బొగ్గు బ్లాక్ డేంజర్ జోన్లో నూతనంగా నిర్మాణాలు జరగ కుండా చర్యలు చేపట్టామన్నారు. కాపురం, తాడిచర్ల నిర్వాసితులకు పునరావాసం వేగవంతం చేస్తామని అన్నారు. జంగేడు, అన్సాన్పల్లి, కొంపల్లిలలో కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి నేడు ఆర్డీవో నేతృత్వంలో అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అన్నారు. కొంపల్లి, గుడాడ్‌పల్లిలో అవసరమైన భూసేకరణ, దుబ్బపల్లి పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ టీిఎస్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, సర్వే ల్యాండ్ ఏడీ సుదర్శన్, ల్యాండ్ అక్విజిషన్ కలెక్టర్ సూపరింటెండెంట్ రవికిరణ్, ఇరిగేషన్ ఈఈలు తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్లు, జెన్కో సీఈ సిద్ధయ్య, ఎస్ఈ తిరుపతయ్య, తహసీల్ధార్లు ఇక్బాల్, సతీష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.