Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మండల పరిధి అన్నారం గ్రామ పంచాయతీ లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మంగళవాంర సర్పంచ్ రమాదేవి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ దూనే సమ్మయ్య దొర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డారు. రైతులు 16శాతం తేమతో ధాన్యం తెచ్చి మద్దతుధర 1960 పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ అన్నారం ఉపాధక్షులు పోచయ్య సోదారి, సీనియర్ నాయకులు గణపతి చారిద రాజశేఖర్, వెన్నపురెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆకుదారి మల్లేష్, పర్సవేనా రాజమల్లు వార్డ్ సభ్యులు ఎర్రయ్య యాదవ్, రాజిరెడ్డి(పెద్దోళ్ల ), బాపురెడ్డి, సర్పంచ్ సురేందర్ పాల్గొన్నారు