Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని ఎస్సై భినవ్ అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించి ఆయన మాట్లాడారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోన నిబంధనలు కఠినతరం చేసిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం సీఐ వాసుదేవ ఆదేశానుసారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో మాస్కులు లేకుండా బాధ్యతారహితంగా తిరుగుతున్న వారికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించారు.