Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అందరూ కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కామారెడ్డి గూడెం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన సందర్శించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు తెలపాలని సూచించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని కోరారు. ఇందుకు ఏవో, ఏఇవోల సలహాలను తీసుకోవాలని సూచించారు. అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని డాక్టర్లకు సహకరించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దార్ పి. శ్రీనివాస్, ఉప తహసీల్దార్ రవీందర్ రెడ్డి, డీఆర్డీఏ రాంరెడ్డి, ఏఓ బి. రామకష్ణ, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
నవతెలంగాణ-లింగాలఘనపురం
వరి సాగు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి పెట్టాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంను, ,ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సంందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కేంద్రం కొనడం లేదని, రైతులందరూ వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అన్నారు. ప్రత్యేక పంటలు వేసే రైతులు ఎలాంటి అనుమానాలు ఉన్న, అవగాహన కల్పించేం దుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. సందేహాలు ఉన్న రైతులు ఆ నెంబర్ ను సంప్రదించి, తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వాక్సినేషన్ ఫస్ట్ డోస్ 100 పూర్తి చేశారని, రెండో డొసు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. గుమ్మడవెల్లి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకతి వనంను పరిశీలించారు. జీడికల్ గ్రామంలో ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. డిఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్ధార్ వీరస్వామి, డాక్టర్ కరుణాకర్ రాజు , ఎంపిడివో సురేందర్, సర్పంచ్ శ్రీపాల్ రెడ్డి, వైస్ఎంపిపి కిరణ్ సిసి శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇతర పంటలు సాగు చేసుకోవాలి
నవతెలంగాణ-మహాముత్తారం
వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఆవుల శివకష్ణ అనానరు. మంగళవారం వజినేపల్లి,మాదారం,జీలపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి సంబంధిత వాల్పోస్టర్లు ఆవిష్క రించారు. ప్రత్యమ్నాయ పంటలపై అవగహన కల్పించారు. ఒకవేళ వరి సాగు చేసుకోవాలనే రైతులు ముందుగా కంపెనీలతో ఒప్పందం చేసుకొని సాగు చేసుకోవచ్చని తెలిపారు. మార్కేట్ లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం ద్వారా పంటకు తగిన మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. వజ్నెపల్లి సర్పంచ్ గోక స్వర్ణలత సదానందం, మాదారం, జీలపల్లి రైతు బంధు సమితి అధ్యక్షులు పోలం సమ్మయ్య, దరిపెల్లి మల్లయ పాల్గన్నారు
రైతులకు అవగాహన సదస్సు
బచ్చన్నపేట: మండలంలోని పోచన్నపేట గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల నిర్వహణపై అవగాహన సదస్సు మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి రాధిక అధ్యక్షతన ఏర్పాటుచేశారు. వరికి బదులు పప్పు దినుసులు వేసుకోవాలని తెలిపారు. సర్పంచ్ గట్టు మంజుల, మల్లేశం, ఎం పి టి సి మామిడి అరుణ ఐలయ్య, గ్రామ రైతుబంధు సమితి కో ఫిరోజ్ రైతుబంధు మండల కో ఆప్షన్ కల్లూరి సంజీవరెడ్డి, ఏఈఓ హారిక పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
మల్హర్ రావు : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఏఈఓ శిరీష అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తాడిచర్ల పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ సుంకరి సత్యనారాయణ, తాడిచర్ల పిఎసిఎస్ వైస్ చైర్మన్ మల్కా సూర్య ప్రకాష్ తో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో ప్రభుత్వం ఎఫ్ సిఐ ధాన్యం సేకరించడం లేదని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని అన్నారు. ఇప్పటికైనా వరి సాగుకు వెళ్లే రైతులు తమ పంటలను అమ్ముకు నేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.