Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ- కోల్‌బెల్ట్
సింగరేణి ప్రైవేటీకరణ, 4 బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 9 ,10, 11న మూడురోజులు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. భూపాలపల్లి ఏరియా కే ఎల్ పి ఎనిమిదో గనిలో మంగళవారం మొదటి షిఫ్ట్ లో జరిగిన గేట్ మీటింగ్ లో కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్( సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్( ఏఐటియుసి) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బి ఎం ఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్, హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడారు. ఈనెల 13న 4 బొగ్గు బ్లాకుల వేలం వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, సింగరేణి ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఔ2003 లో ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్లో ప్రైవేటు వారితో బొగ్గు తీసినప్పుడు అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పాటై సింగరేణి కంపెనీకి మాత్రమే బొగ్గు తీసే హక్కుకు అగ్రిమెంట్ చేసినట్టు తెలిపారు. కానీ సింగరేణి యాజమాన్యం అగ్రిమెంట్ తుంగలో తొక్కి ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా బొగ్గు తీస్తున్నారన్నారు. భవిష్యత్తులో అన్ని ఓసిపిలు అండర్ గ్రౌండ్ మైన్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్ లు నడిపే పరిస్థితి వస్తుందన్నారు. కారిక డిమాండ్ల సాధనకు టీబీజీకేఎస్‌తో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి 9 ,10,11 తేదీల్లో సింగరేణిలో సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. కాంట్రాకీకరణ రద్దు చేయాలని, ఎస్ఆర పి -3 తో పాటు మైన్స్ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, కార్మికుల మారుపేర్లు మార్చుటకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మైనింగ్ స్టాఫ్, ఈ అండ్ ఎం సూపర్ వైజర్స్ , ట్రేడ్ మేన్స్,ఈపి ఆపరేటర్లు మెడికల్ అన్‌ఫిట్ అయితే సర్ఫేస్ లో అదే ఉద్యోగం కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో మాదిరిగా హైపర్ కమిటీ జీతాలు చెల్లించాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు వంగాల రామస్వామి, కంపేటి రాజయ్య, ఏఐటీయూసీ నాయకులు విజేందర్, ఎల్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.