Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
అవగాహనా రాహిత్యంతో మాట్లా డినా, గ్రామ అభివృద్ధి పనులను ఆటంక పర్చినా సహించేది లేదని గుండ్లసాగర్ సర్పంచ్ గాదె ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై మధుమోహన్‌రెడ్డి అనే వ్యక్తి అవగాహన రాహిత్యంతో, అనాలోచితంగా కొందరు గ్రామస్తులతో కలిసి తప్పుడు ఆరోపణలు చేసినట్లు ప్రింట్ , సోషల్ మీడియాల్లో వార్తలు వచ్చాయని ఖండించారు. ఇసుక రవాణాను గ్రామ పాలకవర్గ దృష్టికి, తహసీల్దార్‌కు తెలుపకుండా పాల్పడినట్లు మీడియా సాక్షిగా వారే తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డగించిన తనపై ఆరోపణలు చేయడం వారి మతిలేని మాటలకు నిదర్శనమన్నారు. ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తాజాగా గ్రామంలో సీసీ రోడ్డు లెవెలింగ్ కోసం మొరం తెస్తున్న 6 ట్రాక్టర్లను ఇసుక ట్రాక్టర్‌ను పట్టించాననే కోపంతో ఇసుక ట్రాక్టర్ల వారు అడ్డగించడం వారి దమననీతికి నిదర్శనమన్నారు. గ్రామ అభివద్ధి పనులను అడ్డగిస్తే ఉరుకునేది లేదన్నారు. గ్రామ వనరులను నిబంధనల మేురకు గ్రామ అభివద్ధికి వాడుకోవాలని సూచించారు. గ్రామాభివద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గుండ్లసాగర్ గ్రామానికి గోదావరి నీళ్లు తీసుకరావడంలో తాను చేసిన కషిని ప్రజలు గుర్తించారని చెప్పారు. గుండ్లసాగర్ నుంచి వెంకటాద్రిపేట వరకు బీటీ రోడ్డు, గ్రామ అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మలచడానికి పనులు చేసుకోవాల్సి ఉందని, కషి చేస్తున్నానని, ఇట్టి పనులు పూర్తి అయిన తర్వాత గుండ్లసాగర్ నుంచి పీచర గ్రామం వరకు బీటీ రోడ్డు మంజూరు కోసం పని చేయాల్సి ఉందన్నారు. ఇలాగే గ్రామ అభివద్ధికి పాటుపడతానని దయచేసి ఎవరు కూడా అభివద్ధికి అడ్డు పడకూడదని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీతోనే సర్పంచ్‌గా గెలిచానని, సొంత పార్టీ కార్యకర్తలు, కొందరు గ్రామ నాయకులు, బడా నాయకుల ప్రోత్సాహంతో తనకు అడ్డుపడడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలు, నాయకులు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.