Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఇర్సలాపురం, తాటి గుంపు గ్రామా ల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంట మార్పిడి పద్ధతిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల మీద రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాసమల్ల నాగేశ్వరరావు మాట్లాడారు. వరి పంట వేసి అమ్ముకోవడా నికి ఇబ్బంది పడకుండా పప్పు దినుసులు, నూనెగింజల పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. మండల ఏఓ బానోతు రాంజీ నాయక్ మాట్లాడుతూ ఎఫ్సీఐ యాసంగిలో వరి కొనుగోలు చేయమని ముందుగా ప్రక టించిన క్రమంలో ఆరుతడి పంటలు వేసి తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయం వచ్చేలా నువ్వులు, ఆముదం, వేరు శనగ, పెసర, మినుములు, ఉల్లిగడ్డలు, కోత్తిమీర, తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో వరి పంట వేయవద్దని చెప్పారు. సమావేశంలో ఏఈఓ రమేష్, ఐకేపీ సీసీ అహ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.