Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-బయ్యారం
ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్ర సందర్శన, రాస్తా రోకో కార్య క్రమాన్ని నిర్వహించారు. అఖిలపక్షాల పిలుపులో భాగంగా మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడున్న అధికారులతో సమస్యలు తెలుసుకుని ప్రదర్శనగా బయల్దేరి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షాల నాయకులు ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు, మండ రాజన్న, ములుకూరి జగ్గన్న, సారిక శ్రీను, సైదులు, నామా బాబూరావు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, ఓటీపీ పద్ధతిని ఉపసంహరించుకొని రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంట లకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, స్వామినాథన్ కమి షన్ సిఫార్సులను వెంటనే అమలు పరచాలని, కేంద్ర విద్యు త్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బిల్లకంటి సూర్యం, రామచంద్రయ్య, మురళీ, ఉమ్మగాని సత్యం, తోకల వెంకన్న, రామగిరి భిక్షం, తుడుం వీరభద్రం, డబ్బా వెంకటనర్సు, మోహన్, చంటి, చందు వీరన్న, మోకాళ్ల మురళీకష్ణ, మాదంశెట్టి నాగేశ్వరరావు,జక్కుల యాకయ్య, గొగులసాయి, బొల్లం సోమక్క, పి చంద్రయ్య, వెంకన్న, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.