Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని దుంపెల్లిగూడెంలో ముహరి సమ్మయ్య, చింత శివరామకృష్ణ, లింగంపెల్లి విజయలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయికుమార్ మంగళవారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న పేదలను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూదిరెడ్డి స్వప్న లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహనాయక్, ఎంపీటీసీలు లావుడ్య రాంచందర్, ఆలూరి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యుడు బాబర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి రాజశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు సురునేని శ్రీనివాసరావు, కీర్తి రవి, అజ్మీరా సురేష్, పన్నాల శ్రీరాంరెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జి పూనం రవి, తదితరులు పాల్గొన్నారు.