Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 1వ డివిజన్ పరిధి పలివేల్పులలో 40 ఏండ్లుగా రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ తరలింపునకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రత్యేక చొరవ చూపారు. సుమారు రూ.30 లక్షలతో చేపట్టనున్న రోడ్డు మారమ్మతు పనులతోపాటు విద్యుత్ ట్రాన్సఫార్మర్ తరలింపు పనులను మంగళవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. అనేక ఏండ్లుగా రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌తో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ట్రాన్సఫార్మర్ తరలింపునకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాన్సఫార్మర్ తరలింపుతో పాటు పలివెల్పుల చర్చి నుంచి రింగ్ రోడ్డు వరకు రోడ్డు మరమ్మతు పనులను సుమారు రూ.30 లక్షలతో మంజూరీ చేయించారు. దీంతో పలివెల్పుల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అరూరి రమేష్‌కి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, డివిజన్ ప్రెసిడెంట్ నరెడ్ల శ్రీధర్, మాజీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, కుడా డైరెక్టర్ నన్నెబోయిన రమేష్ యాదవ్, గణిపాక కల్పన, గ్రామ అధ్యక్షుడు లోకేష్, నాగరాజు యాదవ్, మాజీ సర్పంచ్ చేరాలు, చీకటి రవి, అంకూస్ బాబు, ఖాదర్ బాబా, దేవరకొండ శంకర్, సుధాకర్, సదానందం, పులెంట్ల శ్రీదర్, ప్రమోద్, తోట నాగరాజు, నంది శ్రీనివాస్, మూల దేవేందర్, భూపాల్, పెద్ద అంకూస్, పోతారబోయిన విజేందర్, అలువాల రంజిత్, భాను ప్రకాష్, రాజా కొమురయ్య, పసునూరి పవేందర్, తదితరులు పాల్గొన్నారు.