Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని రంగాపూర్‌కు చెందిన వాసం స్వరూపకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి మంగళవారం రూ.24 వేలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించాడు. అనంతరం ఆయన మాట్లా డారు. పేదల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే సీతక్క అహర్నిశలు కషి చేస్తున్నారని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సీతక్క ముందుకు సాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు జాటోత్ చంద్రకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్, సర్పంచ్ వాసం కన్నయ్య, యూత్ కాంగ్రెస్ పస్రా అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్‌రెడ్డి, రేగ కష్ణారావు, జగన్ తదితర నాయకులు పాల్గొన్నారు.