Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ-గూడూరు
గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరి ష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మహబూబా బాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని చిన్నఎల్లాపురం, భూపతిపేట, వెంగంపేట, సీతానాగారం గ్రామాల్లో మంగళ వారం 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. స్వల్ప సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు. మండలంలో ఏజెన్సీ గ్రామాలు, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, పోడురైతులకు పట్టాల బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పింఛన్లు, విద్యుత్, ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్టు చెప్పారు. రైతులకు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పి కోఆప్షన్ సభ్యుడు ఖాసీమ్, రైతు కోఆర్డినేటర్ లింగారెడ్డి, ఎంపీపి బానోత్ సుజాత, జెడ్పీటీసీ గుగులోత్ సూచిత్ర, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మీ, ఎంపీఓ ప్రసాదరావు, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, సంపత్‌రావు, బోడ కిషన్, నర్సింహనాయక్, తదితరులు పాల్గొన్నారు.