Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మల్లూరు సబ్ స్టేషన్ పక్కనే మల్లూరు వాగు ఒడ్డులోని కర్మకాండలకు ఉపయోగించే సర్వేనంబర్ 2-44/1 స్థలాన్ని గ్రామానికి చెందిన యలందాసరి ముత్తయ్య ఆయన కొడుకులు యలమదాసర నర్సయ్య, యలమదాసరి సంతోష్, యలమదాసరి అశోక్, యలమ దాసరి సుధాకర్, యలమదాసరి సమ్మయ్యలకు గ్రామంలో పక్కా నివాస గహాలుండగా గ్రామంలో కర్మకాండలకు ఉపయోగించే భూమిని దురుద్దేశంతో ఆక్రమించుకుంటు న్నారని గ్రామస్తులు తహసీల్దర్ బాబ్జీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ముత్తయ్య అతని కుమారులు గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు పొందారని అయినప్పటికీ గ్రామంలోని కర్మకాండలకు వినియోగించే భూమిపై కన్నేసి ఆక్రమించుకోవడం ఏంట ని గ్రామస్తులు అడిగితే సమాదానం దాటవేస్తూ నిర్మాణాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి అట్టి స్థలాన్ని ఖాళీ చేయించి కర్మకాండలకు వినియోగించుకునేలా పెన్షింగ్ వేసి అప్పగించాలని కోరారు. తహసీల్దార్ ను కలిసిన వారిలో పూజరి సమ్మయ్య, చిన్నాల చక్రధర్, అల్లె జనార్దన్, యరంగారి సురేష్, యాలం కాంతారావు, ఆక రామకృష్ణ, జి.చిరంజీవి, హరిబాబు, సాంబయ్య, నాగ సాంబయ్య, మల్లయ్య, కొమ్మ నరేందర్, వంకాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.