Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
రైతులు వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. మండలంలోని మల్లంపల్లి, శ్రీనగర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళ వారం ఆయన పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు అందించారు. తొలుత కలెక్టర్ కొనుగోలు కేంద్రం లోని మాయిశ్చరైజర్ ద్వారా బస్తాల్లోని ధాన్యాన్ని పరిశీలిం చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని మిల్లర్లకు పంపితే తరుగు లేకుండా గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. లారీల్లో లోడ్ చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దింపుకున్నప్పుడు తేమ శాతం సరిగా లేకపోతే అన్ని బస్తాలకు తరుగు తీస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయ దన్నారు. నల్లరేగడి భూమిలో ప్రత్యామ్నాయంగా జొన్న సాగు చేయవచ్చని తెలిపారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీపాల్, మండల వ్యవసాయ అధికారి సంతోష్, ఏఈఓ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.