Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా చైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులు కావాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానం సొంతమవతుం దని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని జాఫర్ఘడ్, స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్ మండలాల గ్రంథాలయాలను పరిశీలించి ఆయన మాట్లాడారు. పుస్తక పఠనం వల్ల మానసిక వికాసంతో పాటు భవిష్యత్తు ప్రగతి సాధనకు ఉపయోగపడుతుందన్నారు. గ్రంథాలయంలోని పత్రికలు, కథలు, విజ్ఞాన విషయాలు, దేశ నాయకుల జీవిత కథలు విద్యార్థులకు పుస్తకరూపంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెక్రటరీ సుధీర్, బ్రాంచ్ ఇన్చార్జి ధనలక్ష్మి, క్రిష్ణ, కుమార్, తదితరులు పాల్గొన్నారు.